తమిళ్ రీమేక్ కి రామ్ రెడీ

Hero Ram
Hero Ram

ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకోగలిగాడు రామ్ పోతినేని.కాకపొతే సరయిన టైం లో సరయిన సినిమాలు ఎంచుకోకపోవడంతో వెనెకబడ్డాడు.దాంతో హోమ్ బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ లో హిందీ బ్లాక్ బస్టర్ మూవీ బోల్ బచ్చన్ రీమేక్ అయిన మసాలా లో నటించాడు.ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో రామ్ కి ఫుల్ గా నెగెటివ్ మర్క్స్ కూడా పడ్డాయి.దాంతో రీమేక్ సినిమాలు చెయ్యకూడదు అనే కండిషన్ పెట్టుకున్నాడు.

ఆ కండిషన్ తోనే తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ VIP రీమేక్ కూడా కాదనుకున్నాడు.కానీ కథాబలం ఉన్న ట్రెండీ సబ్జెక్ట్ కావడంతో ఆ సినిమా రఘువరన్ బి.టెక్ పేరుతో ఇక్కడ రిలీజ్ అయ్యి భారీ విజయం దక్కించుకుంది.రఘువరన్ ఘన విజయం తరువాత రామ్ రియలైజ్ అయ్యాడు.అయినా ఉపయోగం లేకుండా పోయింది.

ఆ తరువాత వరుసగా స్ట్రెయిట్ సినిమాలే చేసినా నేను…శైలజ ఒక్కటే హిట్ అయ్యింది.అయితే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న రామ్ ఇప్పడు మాత్రం ఒక తమిళ్ సినిమా చేయడానికి రీమేక్ చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడు.తడం అనే తమిళ్ సినిమా పై రామ్ ఇంట్రెస్ట్ చూపించడంతో స్రవంతి రవికిశోర్ పోటీ పడి మరీ ఆ హక్కులు దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

పెద్ద స్టార్స్ లేకపోయినా,మీడియం బడ్జెట్ లోనే తెరకెక్కినా కూడా కంటెంట్ తో ఆ సినిమా హిట్ అయ్యింది.అందుకే రామ్ కూడా తాను పెట్టుకున్న రూల్ ని తానే బ్రేక్ చేసుకుని మరీ ఈ సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు.మరి రామ్ నమ్మకాన్ని ఈ తమిళ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.