టైటిల్స్ తోనే కొత్తదనం చూపిస్తున్న నాగశౌర్య

Naga-Shaurya
Naga-Shaurya

నాగశౌర్య…బయట వాళ్ళతో చేస్తున్న సినిమాలు కలసి రాకపోవడంతో సొంత బ్యానర్ లోనే సినిమాలు చెయ్యడం మొదలుపెట్టాడు.మొదటి సినిమా ఛలో మంచి హిట్ అందించినా ఒక ప్రయోగంలా భావించి చేసిన సెకండ్ సినిమా నర్తనశాల మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.దాంతో మళ్ళీ బయటి బ్యానర్స్ లో తనకి హిట్ అందించిన డైరెక్టర్స్ తో వెరైటీ కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నాడు.వాటిలో మొదటిది నందిని రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న బేబీ.

ఈ సినిమానే పూర్తిగా ఒక కొత్త పాయింట్ మీద బేస్ అయ్యి నడుస్తుంది.ఈ సినిమాలో సమంత తో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు.ఒక రకంగా ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా.కాకపోతే నందిని రెడ్డి ఇంతకుముందు కల్యాణ వైభోగం అనే హిట్ ఇచ్చి ఉండడంతో మళ్ళీ ఆమె డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు.ఇక నాగశౌర్య కి ఊహలు గుసగుసలాడే,జో అచ్యుతానంద అనే రెండు హిట్ మూవీస్ ఇచ్చాడు అవసరాల శ్రీనివాస్.

ఇప్పడు తన మూడో సినిమా కూడా నాగ శౌర్య తోనే చేస్తున్నాడు.ఈ సినిమాకి ఫలానా వాళ్ళ అబ్బాయి…ఫలానా వాళ్ళ అమ్మాయి తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సూపర్ టైటిల్ పెట్టాడు.ఆ మధ్య కాంట్రవర్సీ అయిన సినిమా టైటిల్ ని కాస్త ఎటకారంగా ఉండేలా ఈ టైటిల్ పెట్టారు.ఈ రెండు సినిమాలు టైటిల్ ఇంట్రెస్టింగ్ గా,పాజిటివ్ గా ఉన్నాయి.మరి ఈ సినిమాలు శౌర్య కి ఎలాంటి హిట్ అందిస్తాయో చూడాలి.