టీడీపీకి నటి జయసుధ రాజీనామా…!

Jayasudha
Jayasudha

టిడిపికి ఆంధ్రలో మరో షాక్ తగిలింది.సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీ కి రాజీనామా చేసారు.నుంచి.. వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. గురువారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన జయసుధ.. 2014 ఎన్నికల అనంతరం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. అయితే సడన్ గా ఆమె వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.