జ‌న‌సేన తొలి జాబితా ఎప్పుడంటే..!

Pawan Kalyan
Pawan Kalyan

ఈ నెల 14న జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేనిఫెస్టోతో పాటు తొలిజాబితాను కూడా విడుదల చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేసుకుంటుంది. రాజమండ్రిలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభా వేదిక నుంచే పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2019 ఎన్నికలకు సమర శంఖాన్ని పూరించనున్నారు.

ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటీని వేసి దరఖాస్తుల ప్రక్రియ పూర్తిచేశారు. తుది జాబితాను కమిటీ రూపొందించి అధినేత ఆమోదానికి సిద్ధం చేస్తోంది అధికార , విప‌క్షాల‌కు ధీటుగా . జనసేనాని ఎకరాకు రూ. 8 వేలు ఇస్తానని ప్రకటించి సంచలనానికి సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు.