జైపూర్ లో సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోలు…!

Ram Charan,NTR,Nani,Rana

టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్‌చరణ్‌,అక్కినేని నాగార్జున, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రానా, నాని తదితరులు జైపూర్ లో సందడి చేస్తున్నారు.వీరు శుక్రవారం పింక్‌ సిటీ జైపూర్‌ చేరుకున్నారు. వీరితో పాటు రాజమౌళి కుటుంబం కూడా జైపూర్ వెళ్ళింది. తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు మరికొందరు అక్కడికి వెళ్ళనున్నారు. ఎందుకు అంటే ఎస్‌.ఎస్‌. రాజమౌళి కార్తికేయ పెళ్ళి వేడులకు హాజరు అయ్యేందుకు. ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రామ్‌ప్రసాద్‌ కుమార్తె పూజా ప్రసాద్‌, కార్తికేయ నిశ్చితార్థం నవంబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 న వీరి పెళ్ళి. అందుకోసం టాలీవుడ్ ప్రముఖులు జైపూర్‌ వెళ్తున్నారు. శనివారం మెహందీ, సంగీత్‌ వేడుకలు నిర్వహించనున్నారట.శుక్రవారం రాత్రి వివాహ విందు ఇచ్చినట్టు సమాచారం. జైపూర్‌కి సమీపంలోని కుకాస్‌లోని ఓ ప్రముఖ స్టార్‌ హోటల్‌లో ఈ పెళ్ళి జరగనుంది.