జెర్సీ ఆగుతుందా?…దూకుతుందా?

Jersey Movie
Jersey Movie

నానీ చాలా హోప్స్ పెట్టుకుని చేస్తున్న సినిమా జెర్సీ.ఈ సినిమాకోసం నానీ రెమ్యునరేషన్ కూడా వద్దనుకుని కేవలం ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడానికి కూడా ఓకే అన్నాడు.ఈ సినిమా కథపై,అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న విషయంలో కూడా నానీ చాలా నమ్మకంగా ఉన్నాడు.కానీ ఇది రెగ్యులర్ కమర్షియల్ మీటర్ సినిమా కాదు కాబట్టి మిగతా వాటితో పోటీ వద్దు అనుకుని సోలో రిలీజ్ డేట్ గా ఏప్రిల్ 19 ని ఫిక్స్ అయ్యాడు.

నిన్నటి దాకా ఇది సోలో రిలీజ్ డేట్.కానీ ఇప్పుడు ముని సిరీస్ లో లాస్ట్ మూవీ గా వస్తున్న కాంచన-3 కూడా ఇదే డేట్ కి ఫిక్స్ అయ్యింది.దీంతో జెర్సీ యూనిట్ లో చిన్న టెన్షన్ మొదలయింది.నిజానికి జెర్సీ కి,కాంచన కి కంపేరిజన్ లేదు.అలానే నానీ క్రేజ్ కి,లారెన్స్ మార్కెట్ ని పోల్చి చూడలేం.కాకపోతే జెర్సీ టూ క్లాస్ అండ్ ఎమోషనల్ మూవీ.ఇది పూర్తిగా క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసింది.

యూత్ వరకు కూడా ఓకే.కానీ జెర్సీ అనుకున్నట్టుగా సూపర్ హిట్ అవ్వాలి అంటే,50 కోట్ల మార్క్ అందుకోవాలి అంటే మాత్రం సోలో రిలీజ్ కంపల్సరీ.పైగా ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ లో ఒక్క నానీ తప్ప క్రేజ్ ఉన్న వేరే పేర్లు ఏవీ లేవు.కాంచన సిరీస్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఫెయిల్ కాలేదు.హారర్ కామెడీ అనే ఎలిమెంట్ ని లారెన్స్ బాగా వంటపట్టించుకుని ప్రతి సినిమాలో కూడా నవ్విస్తూ,భయపెడుతున్నాడు.

దాంతో పిల్లల దగ్గరినుండి పెద్దలవరకు,మల్టిప్లెక్స్ నుండి సి సెంటర్స్ వరకు ఆ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా బావుంటే మాత్రం ఇన్స్టంట్ గా కనెక్ట్ అయిపోతుంది.అందుకే ఇప్పడు జెర్సీ యూనిట్ టెన్షన్ పడుతుంది.కాంచన-3 తెలుగు తమిళ్ రిలీజ్ కాబట్టి వాయిదా వెయ్యడం కష్టమే.మరి ఈ పరిస్థితుల్లో జెర్సీ వాయిదా పడుతుందా లేక కాంచన తో పోటీకి రెడీ అంటుందా అనేది వేచి చూడాలి.