జనసేన మేనిఫెస్టోలో హైలైట్స్ ఏమిటో ..!

Pawan Kalyan Kadapa
Pawan Kalyan Kadapa

రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని జనసేన మేనిఫెస్టో రూపొందించారు. ఇక మహిళలు, విద్యార్థులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అధికారంలోకి వస్తే ఉభయగోదావరి జిల్లాల్లో రూ.5వేల కోట్లతో గ్లోబల్‌ మార్కెట్ ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వెల్ల‌డించారు.

జ‌న‌సేన‌ మేనిఫెస్టో ముఖ్యాంశాలు

రైతుకు ఎకరానికి రూ.8000 సాగు సాయం
రైతు రక్షక భరోసా పథకంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల రైతులకు నెలకు రూ.5,000 పింఛను
భూములు కోల్పోయిన కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లింపు
రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు
రాష్ట్ర పారిశ్రామికీకరణలో రైతులకు భాగస్వామ్యం

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించేలా చర్యలు
మహిళలకు పావలా వడ్డీతో రుణాలు అందజేత
ప్రతి జిల్లాలో మహిళలకు ఆసుపత్రి, ప్రత్యేక బ్యాంకు
డ్వాక్రా మహిళలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం
విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ పేరుతో భోజన క్యాంటీన్లు

లంచాలు తీసుకునే వీల్లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తింపు
ముస్లిం సోదరుల కోసం సచార్ కమిషన్ సిఫార్సులు అమలు
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజక్ట్ సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు
ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానంపై ప్రత్యేక ఏర్పాట్లు