జగన్ ఫై చంద్రబాబు నాయుడు ఫైర్…!

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫై మండి పడ్డారు.తాజాగా తెలుగు రాష్ట్రాలలో డేటా మిస్సింగ్ మరో హాట్ టాపిక్ అయ్యింది.టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబందించిన సమాచారాన్ని మొత్తం ప్రవైట్ సంస్థ చేతిలో పెట్టిందని , ప్రజలకు భద్రతా లేకుండా చేస్తుందని వైసీపీ తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుండడం తో బాబు ఆ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

శుక్రవారం తెలుగుదేశం నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన బాబు..జగన్ , కేసీఆర్ ల ఫై విరుచుకపడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టు వైసీపీ అధినేత జగన్‌ నడుచుకుంటున్నారని,ఏపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వైసీపీకి అధ్యక్షుడు జగన్‌ కాదు,కేసీఆరేనని చంద్రబాబు అన్నారు.