జగన్ ప్రకటించబోయే గోదావరి జిల్లాల వైసీపీ అభ్యర్థులు విరేనా…?

YS Jagan
YS Jagan

ఏపిలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఫిబ్రవరి చివరి వారం లేక మార్చి మొదటి వారంలో ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పార్టీ తరపున అభ్యర్ధులను ప్రకటించేందుకు అధికార ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి చివరి వారంలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఇక వారికంటే ముందుగానే తమ అభ్యర్ధులను ప్రకటించాలనే ఉద్దేశంతో జగన్ తన ఆలోచనలకు పదును పెడుతున్నారు. అయితే ముందుగా జగన్ ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుందిముందుగా పీకే సర్వే, ప్రైవేట్ సర్వే, స్థానిక సర్వేల ద్వారా కొందరి పేర్లను ఫైనల్ చేశారని సమాచారం.

తూర్పుగోదావరి జిల్లా:1. ముమ్మడివరం- పొన్నాడ సతీష్ 2. తుని- దాడి సెట్టి రాజా 3. రాజమండ్రి సిటి – రౌతు సూర్యప్రకాశ్ రావు 4. కాకినాడరూరల్- కన్నబాబు 5. రంపచోడవరం- ధనలక్ష్మీ 6. అనపర్తి- సూర్యనారాయణ రెడ్డి 7. అమలాపురం- పీ.విశ్వరూప్ 8. కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి.

పశ్చిమగోదావరి జిల్లా : 1. భీమవరం- గ్రంధి శ్రీనివాస్ 2. నర్సాపురం- ముదునూరు ప్రసాదరాజు 3. పాలకొల్లు- గుణ్ణం నాగబాబు 4. తనుకు- కారుమూర్తి నాగేశ్వరరావు 5. కొవ్వూరు- తానేటి వనిత 6. పోలవరం- బాలరాజు 7. తాడేపల్లి గూడెం- కోట సత్యనారాణ 8. ఆచంట- రంగనాథరాజు 9. దెందులూరు- కొఠారు అబ్బయ్య చౌదరి 10. ఏలూరు-అళ్ళా నాని 11.చింతలపూడి-ఎలిజా.

పశ్చిమ గోదావరి జిల్లా పార్లిమెంట్ : ఏలూరు – కోటగిరి శ్రీధర్ బాబు