జగన్‌కు మేలు చేసేందుకు హైకోర్టుని హడావుడిగా విభజించారు: చంద్రబాబు

N Chandrababu Naidu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్‌ అయ్యారు. వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌పై కేసుల విచారణ దాదాపు ఒక కొలిక్కి వస్తున్న దశలో,విచారణ జాప్యం చేయడం ద్వారా ఆయనకు మేలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయని ఏపి సిఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

హైకోర్టుని హడావుడిగా విభజించడం. న్యాయాధికారులు, ఉద్యోగులు మానసికంగా సిద్ధమయ్యేందుకూ గడువివ్వకుండా ఏపి కి తరలించమనడం దానిలో భాగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని చెప్పారు. హైకోర్టు విభజన నేపథ్యంలో జగన్‌పై కేసులు విచారిస్తున్న సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని, కేసుల విచారణ మళ్లీ మొదటికి వస్తుందని వెల్లడించారు.