గ్రాండ్ గా శృతి హాసన్ రీ ఎంట్రీ

Sruthi hassan
Sruthi hassan

కమల్ హాసన్ కుమార్తె ,చూడడానికి అందంగా ఉంటుంది అనే క్వాలిటీస్ తోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.రెండు,మూడు సినిమాల వరకు ఆమె యాక్టింగ్ కి కూడా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.అయితే ఇండస్ట్రీ హిట్ అయిన గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ సరసన నటించడంతో ఆమె తెలుగులో టాప్ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది.

రేస్ గుర్రం,ఎవడు?,శ్రీమంతుడు,ప్రేమమ్…ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న టైం లో అనుకోకుండా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.కాటంరాయుడు సినిమాలో అయితే ఆమె లుక్స్క్ కి కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.కాటం రాయుడు తరువాత ఆమె పూర్తిగా కనుమరుగైపోయింది.కమల్ తో శభాష్ నాయుడు సినిమా సినిమా సగంలో ఆగిపోయింది.

అయితే ఆమె సినిమాలు సైన్ చెయ్యడం కూడా మానేసింది.మళ్ళీ రీసెంట్ గా మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేస్తున్న ఒక మరాఠా సినిమాకి ఓకే చెప్పింది.మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.అయితే కొరటాల-చిరంజీవి కాంబో లో తెరకెక్కుతున్న సినిమాలో శృతి నటించడం దాదాపు ఖాయం అయ్యింది.

కాకపోతే ఆమెది హీరోయిన్ పాత్ర కాకపోవడం విశేషం.కొరటాల సినిమా అంటే పాత్రలు బలంగా ఉంటాయి,ఇక చిరు సినిమాతో రీ ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ ఛాయస్.సో,రీ ఎంట్రీ లో ఎలా అదరగొడుతుందో,మళ్ళీ ఎన్ని బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.