గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి క‌న్నుమూత‌

ys vivekananda reddy
ys vivekananda reddy

వైసీపీ అధినేత జగన్ బాబాయ్ , మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండె పోటుతో క్నుమూశారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు స‌మాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురి చేసింది.

వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. వైఎస్ వివేకా ఆగస్ట్ 8, 1950న ఆయన జన్మించారు. వైఎస్ వివేకానందరెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన గతంలో కడప లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేశారు. పులివెందుల నుంచి 1989, 1994లో వైఎస్ వివేకా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వైఎస్ మరణానంతరం ఏర్పడిన కిరణ్ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు . అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన క‌న్నుమూత‌తో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.