కొత్త సినిమా అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ…!

Vijay Devarakonda
Vijay Devarakonda

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారి గా స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన గీతగోవిందం సినిమాతో 50 కోట్లు కలెక్షన్స్ వసూళ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.అయితే ఏడాదికి 2 సినిమాలు చేస్తూ యంగ్ హీరోస్ కి గట్టి పోటిగా నిలిస్తున్నాడు విజయ్.ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ తన తరువాత సినిమాను బుధవారం అనౌన్స్ చేసాడు.

ఈ సినిమాకు హీరో టైటిల్ ను ఖరారు చేసారు.మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాది నాలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. ఏప్రిల్ 22 న ఢిల్లీలో ఈ సినిమా ప్రారంభం కానుంది.