కేటీఆర్‌ను మహానాకుంభమేళాకు ఆహ్వానించిన యూపీ మంత్రి సతీశ్‌…!

KTR

తెలంగాణా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కు ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే మహా కుంభమేళాకు ఆహ్వానం అందింది. 2019లో జరిగే కుంభమేళాకు హాజరుకావాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ కు చెందిన మౌలికవసతుల, పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీశ్‌ మహానా శనివారం కేటీఆర్‌ను కోరారు. ఆమేరకు శనివారం తెరాస భవన్‌కు చేరుకున్న సతీశ్‌ మహానా కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్‌తో కొద్దిసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై వీరి మధ్య చర్చ సాగింది. ఈసందర్భంగా కుంభమేళాకు తప్పని సరిగా హాజరు కావాలని సతీశ్‌ మహానా కేటీఆర్‌ను ఆహ్వానించారు. 2019, జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు యూపీలోని అలహాబాద్‌లో జరగనుంది.ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పవిత్ర గంగా స్నానాల కోసం తరలిరానున్నారు.