కాపీ ఆరోపణలపై జక్కన్న క్లారిటీ

SS Rajamouli
SS Rajamouli

రాజమౌళి…ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడు.ప్రతి సినిమాని కూడా ఒక యజ్ఞంలా భావించి కష్టపడతాడు కనుకే విజయాలు వరిస్తున్నాయి.అయితే రాజమౌళి సినిమాలు,వాటిలో సీన్స్,చివరికి పోస్టర్స్ కూడా కాపీ అంటూ కొంతమంది ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంటారు.విక్రమార్కుడు సినిమాలో విక్రమ్ రాథోడ్ బెల్ట్ తో రౌడీ ని చంపే సీన్ కర్తవ్యం నుండి కాపీ చేసాడు అంటారు.

అలానే సై సినిమాలో రగ్బి ఆట కాన్సెప్ట్ వేరే హాలీవుడ్ మూవీ కాపీ అని టాక్ ఉంది.బాహుబలి ఫస్ట్ పోస్టర్ వేరే లాంగ్వేజ్ సినిమా పోస్టర్ ని పోలిఉండని వేడికి పట్టుకుని ప్రూఫ్ గా దాన్ని కూడా కలిపి పోస్ట్ చేసారు.ఇక్క బాహుబలి సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ ఫైట్ కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది మాతృక అనే వారు ఉన్నారు.అయితే ఇలా తన మీద వచ్చిన కాపీ ఆరోపణలను కొట్టిపారేశాడు జక్కన్న.

ఎవరో ఎదో అనుకుంటారు అని తాను అనుకున్నది చెయ్యడం ఆపను అని చెప్పేసాడు.ఇక RRR మెయిన్ ప్లాట్ కి మోటార్ సైకిల్ డైరీస్ లోని మెయిన్ ట్విస్ట్ ఇన్స్పిరేషన్ అని ముందే రివీల్ చేసి షాకిచ్చాడు.అసలు రాజమౌళి తాను తీస్తున్న సినిమా గురించే ఎప్పుడూ ఇంత క్లారిటీ ఇవ్వఁడు అనుకుంటే ఇప్పడు ఏకంగా తనకి RRR పాయింట్ ఎలా తట్టిందో కూడా చెప్పేసాడు.

దీనివల్ల RRR రిలీజ్ అయ్యాక ఇది ఫలానా సినిమానుండి రాజమౌళి కాపీ కొట్టాడు అనే రాసుకునేవాళ్లకి శ్రమ తగ్గించాడు.అయితే రాజమౌళి పై వచ్చిన కాపీ ఆరోపణల గురించి మాట్లాడుతున్న టైం లో ఎన్టీఆర్ కలగజేసుకుని అలాంటివి మా వరకు రాలేదు అని చెప్పడం ,ఆ ప్రశ్నకు జక్కన్న ఆన్సర్ ని శ్రద్దగా వినడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది.కానీ ఇకపై రాజమౌళి సినిమాల గురించి కాపీ అంటూ మాట్లాడేవాళ్ళకి మాత్రం రాజమౌళి క్లారిటీ ఎవర్ గ్రీన్ సమాధానం గా నిలుస్తుంది.