కాంగ్రెస్‌కు చేవెళ్ల చెల్లెమ్మ క‌టీఫ్ – కారు ఎక్కేందుకు రెఢీ

sabitha indra reddy
sabitha indra reddy

ఎన్నిక‌ల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. కాంగ్రెస్‌ నుంచి టి ఆర్ ఎస్ లోకి వలసలు కొనసాగుతునే వున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియ నాయక్‌, చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరారు. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ ఎస్ లో చేరనున్నారు.

ప్రగతి భవన్‌లో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తన కుమారులతో కలిసి సబితా రెడ్డి స‌మావేశం అయ్యారు. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కుమారుడు కార్తీక్‌ రెడ్డికి కేటాయించడంతో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను కోరినట్టు స‌మాచారం.

కేసీఆర్‌ మాత్రం చేవెళ్ల ఎంపీ స్థానం ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో చేవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభలో కారెక్కనున్నట్టు సబితా ఇంద్రారెడ్డి కుటుంబ స‌భ్యులు తెలిపారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో టి ఆర్ ఎస్ లో చేరనున్నారు.