కర్నూలులో టిడిపి అభ్యర్ది పై దాడి…!

Kurnool Attack
Kurnool Attack

ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. పరస్పర విమర్శలే కాదు భౌతిక దాడులూ జరుగుతున్నాయి. కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసిపి నేత బాలానాగిరెడ్డి స్వగ్రామం ఖగ్గల్‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి పర్యటించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని వైసీపీ వర్గీయులు అడ్డుకొని..టీడీపీ జెండాను తొలగించినట్లు సమాచారం.

అంతేకాదు ఎమ్మెల్యే బాలానాగిరెడ్డి వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తిక్కారెడ్డి గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో తిక్కారెడ్డితో పాటు మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్‌కు గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారగా మోహరించారు.