ఓట‌రుగా న‌మోదుకు ఇంక‌ నాలుగు రోజులే ..!

Local Elections
Local Elections

సార్వత్రిక ఎన్నికల నేప‌ధ్యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఓటరుగా నమోదుకు ఇక నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ టైమ్ లోపు నమోదు చేసుకోకపోతే వచ్చే నెల 11వ తేదీన జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవ‌కాశం వుండ‌దు. కొత్తగా ఒటు అర్హత సాధించిన వారైనా, ఓటర్‌ జాబితాలో పేరు లేని వారైనా ఈ నెల 15వ తేదీలోగా ఆన్‌ లైన్ (www.nvsp.in) ద్వారా, సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు,మున్సిపల్‌ కార్యాలయాల్లో ఫాం 6 ను సమర్పించడం ద్వారా ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఈ విధంగా సమర్పించినవారికే 11వ తేదీన ఓటు వేసే హక్కు కల్పిస్తామన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. 18 సంవత్సరాలు నిండి ఇంకా ఓటర్‌గా నమోదు కాని యువత రాష్ట్రంలో 11 లక్షల మంది ఉన్నార‌ని వివ‌రించారు ఆయ‌న‌.

వారంతా ఈ నెల 15వ తేదీలోగా ఫామ్‌– 6 సమర్పించాల‌న్నారు. జాబితాలో పేరుందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటే వారికి ఈ నెల 25వ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తామని ఆయన వెల్ల‌డించారు.