ఓట్ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకోండి

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

విజ‌య‌మే ల‌క్ష్యంగా యుద్దానికి సన్నద్ధం కావాలన్నారు తెలుగుదేశం అధినేత ,ఏపి సిఎం చంద్రబాబు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయ‌న మాట్లాడారు. కుటుంబపెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత త‌న‌దేన‌న్నారు . అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్ప‌ష్టం చేశారు ఆయ‌న‌.

పనిచేసిన వారితో పాటు సామాజిక న్యాయం టిడిపి అభ్యర్థుల ఎంపికలో ఉంటుందన్నారు. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని తాను చెబితే అర్థం చేసుకుంటున్నారన్నారు. పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని వివ‌రించారు అధినేత చంద్ర‌బాబు . అందరినీ గుర్తించి భవిష్యత్తులో త‌గిన పదవులిస్తామన్నారు.

ఈ మూడ్రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి, మినహాయింపు లేదన్నారు. వైసిపిలో వేలంపాటలా టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్నార‌ని విమ‌ర్శించారు బాబు.