ఒకే ఒక్క సినిమాతో పెళ్లిపీటలెక్కారు

Arya Marrige
Arya Marrige

అఖిల్ సినిమాలో హీరో అఖిల్ పక్కన మెరిసిన హీరోయిన్ అందరికి గుర్తుండే ఉంటుంది.ఫస్ట్ సినిమానే డిజాస్టర్ గా నిలవడంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు రాలేదు.దాంతో కోలీవుడ్ కి వెళ్ళింది.అక్కడ అవసకాశాలయితే వచ్చాయికానీ కోరుకున్న హిట్ మాత్రం రాలేదు.అయితే ఈ లోగా తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ గజినీకాంత్ లో ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

ఆ సినిమా హీరో,కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఆర్య తో లవ్ లో పడింది.అతను కూడా అనేకమంది టాప్ హీరోయిన్స్ తో పనిచేసినా ఫైనల్ గా సయేశా కి ఫ్లాట్ అయిపోయాడు.ఇంట్లో పెద్దలు కూడా పెద్దగా అభ్యతరం చెప్పకపోవడంతో వీళ్లిద్దరు రియల్ లైఫ్ కపుల్ గా మారారు.అయితే వాళ్ళ వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ముస్లిమ్ పద్దతిలో ఇద్దరూ భార్య భర్తలుగా మారారు.తమిళ్ పరిశ్రమకి చెందిన అనేకమంది ప్రముఖులు తరలి వచ్చారు.అలాగే కొంతమంది తెలుగు ప్రముఖులు కూడా హాజరయ్యారు.అయితే ఆయేయ వయసు 38 సంవత్సరాలు కాగా సయేశా వయసు కేవలం 22 సంవత్సరాలు.అయితే సినిమా ఇండస్ట్రీ లో ఈ తరహా ప్రేమలు,పెళ్లిళ్లు కొత్తకాదు.హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు ఆర్య అండ్ సయేశా.