ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు…!

AP Elections 2019
AP Elections 2019

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది.దేశం మొత్తం ఏడు విడతలగా ఎన్నికలు జరగనున్నాయి. కానీ మొదటి ఫేజ్‌లోనే ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10వ తేదీ ఆదివారం ప్రకటించింది.అయితే ఆంధ్రప్రదేశ్,తెలంగాణాలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పార్లిమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీలు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు సింగిల్ ఫేజ్ లో జరగనున్నాయి.

మార్చి 18వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా మార్చి 25వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన మార్చి 26, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28గా ఉంది. ఏప్రిల్ 11 ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు మాత్రం మే 23 రిలీజ్ చేయనున్నాయి.