ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన సీఎం కేసీఆర్

KCR
KCR

ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన పోలింగ్ లో సిఎం ఓటు వేశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగింది. పోలింగ్ ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్ లో జరిగిన మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు.

అనంతరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి వచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎమ్మెల్యేలతో కలసి బస్సులోనే వచ్చారు. మ‌రోవైపు ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి గూడూరి నారాయణరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ.

ఈ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించింది. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నలుగురు, మజ్లిస్‌ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే కానుంది . టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మహముద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం కాగా, మజ్లిస్‌ అభ్యర్థి రియాజ్‌ బ‌రిలో వున్నారు.