‘ఎఫ్ 2’ ఆడియో లాంచ్ డేట్ ఖరారు…!

Venkatesh,Varun Tej

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్సు వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఈ సినిమాలో తమన్నా,మేహరిన్ హీరోఇన్లు గా నటిస్తున్నారు.ఈ సినిమాలోని రెండు సింగిల్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 30 వ తేదీ సాయంత్రం 6 గంటలకు వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నది.

ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంఫై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.