ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి

Elections
Elections

ఈనెల 18వతేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తొలి విడతలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 25వతేదీ తుది గడువుగా ఆయ‌న వెల్ల‌డించారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 28వరకు గడువు ఉందని తెలిపారు.

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల 95 లక్షల 29 వేల మంది ఓటర్లున్నారన్నారు. నామినేషన్లు వేయడానికి ఐదుగురు మించి రావద్దన్నారు . పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు రూ.75 లక్షలకు మించకూడదన్నారు.