ఎన్టీఆర్ మ‌నుమ‌డు వైసిపి లోకి ..?

DaggubatiPurandeshwari
DaggubatiPurandeshwari

రాజ‌కీయాల‌లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు వుండ‌ర‌నేది నిత్య స‌త్యం.ఇక పాలిటిక్స్‌లో ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ ఉంటారో ఎవరూ చెప్పలేని పరిస్థితి కూడా వుంటుంది.ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలలో దగ్గుబాటి కుటుంబం పేరు తెలియ‌నివారు వుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.ఎన్టీఆర్ అల్లుడిగా.. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు పగ్గాలు అందుకొనే కీలక సమయంలోనూ ఆయ‌న పాత్ర అంద‌రికీ తెల్సిందే. ఆయ‌నే దగ్గుబాటి వెంకటేశ్వరరావు.అయన భార్య.. ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు.ఇప్పుడు వీరి కుమారుడు, ఎన్టీఆర్ కు మరో మనుమడు అయిన హితేష్ కూడా రాజకీయాలలోకి అరంగేట్రం చేయనున్నార‌ని స‌మాచారం.

ఇటు హితేష్ కు చంద్రబాబు కుమారుడు, ఏపీ మంత్రి లోకేష్ తో మంచి సంబంధాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది.కానీ హితేష్ ఎంట్రీ మాత్రం వైసీపీ నుండి జరగనుందని జిల్లా రాజకీయాలలో పబ్లిక్ టాక్.దీనికి కారణం హితేష్ పోటీ చేయాలనుకుంటున్న ప్రకాశం జిల్లా పర్చూరు స్థానంలో..సిటింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును టిడిపి మార్చే ఉద్దేశ్యంలో లేకపోవడ‌మేన‌ని తెలుస్తోంది.హితేష్ కు ఎన్టీఆర్ మనుమడు అనే ట్యాగ్ ఉండడంతో వైసీపీ అక్కడ నుండి సీటు కేటాయించడానికి సిద్ధంగా ఉందట.ఇక అమ్మ పురంధేశ్వరికి బీజేపీ నుండి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ..హితేష్ చూపు వైసీపీ వైపే వుంద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో చ‌ర్చించుకుంటున్నారు .మరి హితేష్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఎంతవరకు నిజమవుతుందో..అరంగేట్రం వైసీపీ నుండే ఉంటుందా అన్నది ప్ర‌కాశం రాజకీయాలలో సెంట‌ర్ ఆఫ్ ది టాక్ గా విన‌ప‌డుతోంది.