ఉపేంద్ర మార్క్ మూవీ

I Love You Movie
I Love You Movie

ఉపేంద్ర సినిమాలు చూసిన వాళ్ళ గురించి అతని తిక్క గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.అతని సినిమాలు చూడని వాళ్లకు అతని సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.అయితే చాలా గ్యాప్ తరువాత ఉపేంద్ర ఒక కన్నడ-తెలుగు బైలింగువల్ సినిమాలో నటించాడు.ఆ సినిమా పేరు ఐ లవ్ యు.నన్నే ప్రేమించు అనేది క్యాప్షన్.

ఆ సినిమా ట్రైలర్ కూడా ఉపేంద్ర గత సినిమాల మాదిరిగా ఉపేంద్ర ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది.గతంలో సుధీర్ బాబు హీరోగా కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే వెరైటీ లవ్ కాన్సెప్ట్ తో సినిమా చేసిన చంద్రు ఈ సినిమాని కూడా తెరకెక్కించాడు.నిర్మాత కూడా అతనే.ఈ సినిమాలో కొత్తదనం అనేది లేదు కానీ ఉపేంద్ర పాత్ర తీర్చిదిద్దిన విధానం కాస్త వెరైటీ గా ఉంది.

కన్నడ డింపుల్ క్వీన్ రచితా రామ్ ఈ సినిమాలో హీరోయిన్.ఉపేంద్ర మార్క్ కామెడి,ఉపేంద్ర పెర్ఫరామెన్స్,ఉపేంద్ర ఫైట్స్..ఇలా చెప్పుకుంటూ పోతే కన్నడలో,తెలుగులో ఉపేంద్ర కి ఉన్న ఫాలోయింగ్ ని బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు అని అర్ధమవుతుంది.మరి ఆ క్రేజ్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో,ఈ సినిమా ఏ రేంజ్ విజయం అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.