ఉద్ఘర్ష మొదటి పోస్టర్ విడుదల

#Udgharsha #Sunilkumardeshai సునీల్ కుమార్,డి మంజునాథ్, రాజేంద్ర కుమార్,ఉద్ఘర్ష,ఆర్ దేవరాజ్

DEE క్రియేషన్స్ పతాకం పై సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వం లో డి మంజునాథ్, రాజేంద్ర కుమార్ సహా నిర్మాతలు గా ఆర్ దేవరాజ్ నిర్మాతగా ఠాకూర్ అనూప్ సింగ్, ధన్సిక, బాహుబలి ప్రభాకర్,కబీర్ దుహన్ సింగ్, శ్రద్ధ దాస్, తాన్యా హోప్ వంశి కృష్ణ వంటి తారాగణం తో తెలుగు, కన్నడ మరియు తమిళ భాషలో నిర్మించబడుతున్న సినిమా ఉద్ఘర్ష. ఉద్ఘర్ష చిత్రానికి సంబందించిన మొదటి పోస్టర్ ను తెలుగు లో విడుదల చేసారు.

పాత్రికేయుల సమావేశం లో సహా నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ ” నాకు దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ 25 ఏళ్ళు గా పరిచయం ఉన్నారు. సునీల్ కుమార్ ఎలాంటి దర్శకుడో నాకు చాలా బాగా తెలుసు. సినిమా బాగా వచ్చింది, ఉద్ఘర్ష సినిమా విజయం మీద మాకు చాలా నమ్మకం గా ఉన్నాం. త్వరలోనే సినిమా విడులచేస్తాము” అని తెలిపారు.

“ఈ ఉద్ఘర్ష సినిమా చాలా డిఫరెంట్ , రెగ్యులర్ సినిమా కాదు అని నిర్మాత ఆర్ దేవరాజ్ తెలిపారు . ప్రతి సీన్ ఉత్కంఠం గా ఉంటుంది అని, త్వరలో విడుదల చేస్తాం” అని కూడా తెలిపారు.