ఈ నెల 16వ తేదీన వైసిపి తొలి జాబితా విడుదల…!

ysrcp
ysrcp

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు పోటి చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసుకుంటున్నారు .జనసేన మొదటి జాబితా ఒకటి రెండు రోజులో విడుదల కానుండగా,తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల జాబితా ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.ఇక వైసిపి విషయానికి వస్తే తొలి జాబితా ఈరోజు విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించినప్పటికీ చివరి నిముషంలో వైసిపి జాబితా వాయిదా పడింది. తొలి జాబితాలో సుమారు 80 అసెంబ్లీ, 13 మంది లోక్ సభ అభ్యర్ధులతో జాబితా తయారైందని సమాచారం.

టిడిపి నుండి వైసిపిలో చేరికలు బారిగా ఊపందుకుండటంతో, అంతేకాకుండా టిడిపిలో నుండి మరింకొందరు ముఖ్యనేతలు వైసిపిలోకి రావచ్చన్న సంకేతాలు అందటంతో జాబితా ప్రకటనను వాయిదా వేసినట్లు సమాచారం . ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్, టిడిపి కాకినాడ ఎంపి తోట నర్సింహం, సినీనటుడు రాజా రవీంద్ర, విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు తదితరులు ఇప్పటికే వైసిపి కండువా కప్పుకున్నారు.కాగా ఈనెల 16వ తేదీ ఉదయం 10.26 గంటలకు ఇపుపులపాయలో జాబితాను విడుదల వేయాలని జగన్ నిర్ణయించారు.