ఇటు చంద్ర‌బాబు.. అటు జ‌గ‌న్ 16 నుంచే ప్ర‌చారానికి శ్రీకారం

Jagan Chandrababu
Jagan Chandrababu

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 16 నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్నారు రెండు ప్ర‌ధాన పార్టీల అధినేత‌లు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో ఎన్నికల ప్రచారానికి సెంటిమెంట్ గా శ్రీకారం చుట్ట‌నున్నారు. అనంత‌రం ఈనెల 17న విశాఖలో బూత్‌ కమిటీలతో కీలక సమావేశం నిర్వహించ‌నున్నారు సిఎం చంద్ర‌బాబు .

అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్ ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇడుపులపాయ నుంచి జగన్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి, ఆయన ఆశీస్సులతో జగన్‌ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అదే రోజు జగన్‌ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.

తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్‌ మ్యాప్ త‌యారు చేసుకున్నారు. రోజుకు మూడుకి పైగా సభలు ఉండేలా ప్లాన్‌ చేశారు. పాదయాత్ర ద్వారా కవర్‌ కాని నియోజకవర్గాల్లో సభలు ఉండేలా ప్ర‌ణాళిక రూపొందించారు.