ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు తెలంగాణ కాంగ్రెస్ ఢీలా

Paler-MLA-with-KTR
Paler-MLA-with-KTR

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారుతోంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే వుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోయే ప్ర‌మాదం పొంచి వుంది. తాజాగా టిఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మరొకరు చేరనున్నారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసకుంటున్నారు.

ఉపేందర్‌ రెడ్డి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌తో కలిసి వచ్చి టిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో సమావేశమయ్యారు. త్వరలో సిఎం కెసిఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావుపై ఉపేందర్‌ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. మ‌రోవైపు ఇప్ప‌టికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టి ఆర్ ఎస్ వైపు వెళ్లి పోవ‌డంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొనే అవ‌కాశాలున్నాయి.