ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషంతో కేసీఆర్‌ కుటుంబం ఉంది – ఏపి సిఎం చంద్ర‌బాబు

Election, Political, Ap, Andhara Pradesh, Agriculture , Tdp, Congress, Bjp,
Chandra babu naidu
తెలంగాణ  సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్  కేటీఆర్‌పై ఏపి  సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆరేనని,  వైసీపీ, టీఆర్ఎస్ కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని తీవ్ర విమర్శలు చేశారు.  వైసీపీ అధినేత జగన్ ని టీఆర్ఎస్‌కు డమ్మీగా చేశారని ఎద్దేవా చేశారు. ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషంతో కేసీఆర్‌ కుటుంబం ఉందన్నారు ఆయ‌న‌.   దీనికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే రుజువని స్పష్టం చేశారు. 

తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్‌తో జగన్‌కు దోస్తీ ఏంటని ప్రశ్నించారు చంద్ర‌బాబు. ముందు కేసీఆర్‌ పెట్టుబడి పెడతారు.. తరువాత జగన్ కప్పం కడతారంటూ విమర్శించారు ఆయ‌న‌. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసిపి, టి ఆర్ ఎస్ , బిజేపి కుట్ర పన్నుతున్నాయని ఏపి సిఎం చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సమాచారం చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందన్నారు.

ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తామని స్పష్టం చేశారు ఏపి సిఎం. రాష్ట్ర ప్రతిష్ఠ కోసం తాను కష్టపడుతుంటే, అప్రతిష్ఠ తెచ్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సిఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి డ్వాక్రా మహిళ ఖాతాలో ఇవాళే రూ.3,500 జమ చేసుకునే వీలు కల్పించామన్నారు.