అసెంబ్లీ తీర్మానం ఏమైంద‌న్న ఏపి సిఎం చంద్ర‌బాబు

Chandra Babu Naidu

ఎన్నికలు వస్తున్నందునే అగ్రవర్ణాల రిజర్వేషన్లను కేంద్రం తెరపైకి తెచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.కర్నూలు జిల్లాలోని కోస్గిలో నిర్వహించిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమం సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని ఆమోదించి కేంద్రానికి పంపామని, అది ఏమైందని సీఎం ప్రశ్నించారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంకా 85 వేల కోట్లు ఇవ్వాలని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందన్నారు.ప్రజలు జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారన్నారు. వైసిపి మన మధ్య చిచ్చు పెట్టి తాకట్టు పెట్టేందుకు చూస్తోందన్నారు . రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కేంద్రం బాధ్యత వహించాలన్నారు.