అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేని వాళ్ళు పంచాయితీలో గెలుస్తారా ?

TDP, CONGRESS, TRS, BJP, CHANDRABABU NAIDU,
tdp

తెలుగు దేశం పార్టీకి ఊహించని మార్పుతగిలింది గత అసెంబ్లీ ఎన్నికల్లో. అధికారం మీద పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు టీడీపీ. టీడీపీ నిలబడిన స్థానాల్లో కనీసం 10 చోట్ల అయినా గెలుస్తామని ధీమాగా ఉండేది. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. కేవలం 2 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో పార్టీ దాదాపు గా లేదు.

అయినా కూడ టీడీపీ పట్టు విడవడంలేదు. తెలంగాణలో తమకు ఇంకా ప్రజాదరణ ఉందనే అంటున్నారు. దానిని రాబోయే పంచాయితీ ఎన్నికల్లో రుజువు చేస్తామని అన్నారు. టీడీపీ,కాంగ్రెస్ లు కలిసి కూటమిగా పోటీ చేసినా సీనియర్ నాయకులే గల్లంతయ్యారు. ఇందుకు కారణం పల్లె ప్రాంతాల్లో సైతం ఈ రెండు పార్టీల పట్ల వ్యతిరేకత ఉండటమే కదా. అలాంటిది టీడీపీ పంచాయితీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండటం చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. కానీ దాన్ని అధిగమించి, వ్యతిరేకతను తప్పించుకుని టీడీపీ నెగ్గుతామని చెబుతున్నారు.