అల్లుఅర్జున్ తో మరోసారి ఛాన్స్ కొట్టేసిన టాప్ హీరోయిన్…!

Catherine Tresa
Catherine Tresa

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం ఫెయిల్యూర్ తర్వాత చాల గ్యాప్ తీసుకున్న అల్లుఅర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసాడు.ఈ సినిమాలో ఇద్దరు హీరోఇన్లు నటించనున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నారు.కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అల్లు అర్జున్,క్యాథరిన్ కలిసి ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు,సరైనోడు,రుద్రమదేవి చిత్రాల్లో కలిసి నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.