అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు

SUPREME COURT OF INDIA
SUPREME COURT OF INDIA
అయోధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ సమస్య పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను సుప్రీంకోర్టు నియమించింది. శ్రీశ్రీ రవిశంకర్‌, శ్రీరామ్‌ పంచు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఖలీపుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్‌లో జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  

మధ్యవర్తిత్వ ప్రక్రియ గోప్యంగా ఉంచాలని చెప్పింది. మధ్యవర్తులకు 8 వారాల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు 4 వారాల్లో మొదటి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం కేవలం భూమికి సంబంధించింది కాదని, వివిధ వర్గాల ప్రజల మనోభావాలు, మత విశ్వాలతో కూడుకున్నదని సుప్రీం వ్యాఖ్యానించింది.

ఇక అయోధ్యలోని 2.7 ఎకరాల వివాదస్పద భూమిపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. రామ్‌లల్లా, నిర్మోహ అఖోడా, సున్నీ వక్ఫ్‌ బోర్డు మధ్య ఈ వివాదం ర‌గులుతోంది. తాజాగా ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు అప్పజెప్పడంతో ఈ 2.7 ఎకరాలు ఎవరికి చెందుతుందో ఈ ప్యానెల్‌ తేల్చనుంది.