అన‌కాప‌ల్లి లోక్‌స‌భ బ‌రిలో కొణ‌తాల ..?

Konathala Ramakrishna
Konathala Ramakrishna
అన‌కాప‌ల్లి లోక్‌స‌భ బ‌రి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధిగా కొణ‌తాల రామ‌కృష్ణ పేరును ఆ పార్టీ ప‌రిశీల‌న‌లోకి తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా  కొణతాల రామకృష్ణ తాజాగా  తెలుగుదేశం పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యారు.కొంత కాలం  త‌ట‌స్ధంగా వున్న ఆయ‌న  ఈ నెల 17న ఆంద్ర‌ప్ర‌దేశ్  ముఖ్య‌మంత్రి  చంద్రబాబు సమక్షంలో  పచ్చ కండువాను కప్పుకోనున్నారని చెబుతున్నారు.


కొణ‌తాలకు అనకాపల్లి లోక్ సభ టికెట్ ను కూడా ఇచ్చేందుకు చంద్రబాబు అంగీక‌రించార‌ని తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సీటుపై విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌, అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఆసక్తి చూపుతున్నార‌ని స‌మాచారం. అయితే పార్టీ తీర్ధం పుచ్చుకునే కొణతాలకే ఛాన్స్ ఎక్కువ‌గా వున్న‌ట్లు తెలిసింది.